సామాజిక ఆర్టిఐ కార్యకర్తలను ప్రభుత్వం అధికారికంగాగుర్తించాలీ

256చూసినవారు
సామాజిక ఆర్టిఐ కార్యకర్తలను ప్రభుత్వం అధికారికంగాగుర్తించాలీ
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సామాజిక ఆర్టీఐ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ, జిల్లాలో సమాచార హక్కు చట్టం-2005ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని అధికారులను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీఐపై ప్రచారం చేపట్టాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న కార్యకర్తలను అధికారికంగా గుర్తించి, ఆగస్టు 15, జనవరి 26న సన్మానించి ప్రశంసా పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్