యాదవ నాయకులకు సన్మానం: రాజకీయాల్లో ఎదగాలని పిలుపు

1133చూసినవారు
యాదవ నాయకులకు సన్మానం: రాజకీయాల్లో ఎదగాలని పిలుపు
కోదాడ నియోజకవర్గంలో లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో యాదవ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని, యాదవులు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి శాసించే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తండు శ్రీనివాస్ యాదవ్, అంబర్‌పేట శ్రీనివాస్ యాదవ్, మేకల వీరన్న యాదవ్, బెల్లి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్