సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ, ఎండల తీవ్రత నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శనివారం సూర్యాపేటలో సిబ్బందికి చలువ అద్దాలు, వైట్ క్యాప్స్, బాటిల్స్, హెల్మెట్స్ వంటి సమ్మర్ కిట్స్ ను ఆయన అందించారు. మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని, షిఫ్ట్ వారీగా డ్యూటీలు నిర్వహించాలని సూచనలు చేశారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.