
ధరల స్థిరీకరణపై కేబినెట్ ఉపసంఘం భేటీ
AP: సచివాలయంలో ధరల స్థిరీకరణపై కేబినెట్ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడుతోపాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు అధికారులు నిత్యం పర్యవేక్షించాలని మంత్రి నాదెండ్ల సూచించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా ధరలలో స్వల్ప పెరుగుదల సంభవించినప్పటికీ వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.




