సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

1చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం గాజులరామారంలో హైడ్రా కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని పరిశీలించి, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రభుత్వ ఏజెన్సీ కాదని, కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పనిచేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రాతో కూలగొట్టిన పేదల ఇళ్ల శిథిలాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రేవంత్ రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్