సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్
ఇండియా (SGFI) సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు–2026–27 టోర్నమెంట్, సెలక్షన్ పోటీలను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర
కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే వారి భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉంటుందని అన్నారు.