ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఖాజా ఖలీల్ అభినందనీయుడని అన్నారు. సూర్యాపేట మండలం దూరజ్ పల్లి హై స్కూల్ లో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఖలీల్ సన్మాన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని సామాజిక సేవకు, సంఘ కార్య క్రమాలకు ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.