
ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన దోశ.. విషమంగా తల్లిదండ్రుల పరిస్థితి
అహ్మదాబాద్‌లోని చాంద్ఖేడాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 1న స్థానిక డెయిరీ నుంచి కొనుగోలు చేసిన దోశ పిండితో తయారు చేసిన దోశలు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజనింగ్తో మరణించారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అస్వస్థతకు గురై అత్యవసర చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, డెయిరీ యజమాని తమ పిండి నాణ్యతపై ఎటువంటి సందేహాలు లేవని పేర్కొన్నారు.




