బండమీది చందుపట్ల గ్రామంలో గణనాథునికి మహానదానం

0చూసినవారు
బండమీది చందుపట్ల గ్రామంలో గణనాథునికి మహానదానం
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని దుర్గాకాలనీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గణేష్ నవరాత్రోత్సవాలలో భాగంగా మహానదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్త జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు లింగాల సంతు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డం లింగారెడ్డి, శివరాత్రి రమేష్, లింగాల సంతు, బోలగాని నవీన్, రాచకొండ శ్రీను, సుద్దగాని మహేష్, తూముల అనిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్