పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం లో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మ వార్ల ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, గ్రామ సర్పంచ్ నాతల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండి రామకృష్ణ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.