ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


భారత తీరానికి భారీ ఎల్పీజీ ట్యాంకర్లు: 94 వేల టన్నుల సరుకు
Mar 29, 2026, 14:03 IST/

భారత తీరానికి భారీ ఎల్పీజీ ట్యాంకర్లు: 94 వేల టన్నుల సరుకు

Mar 29, 2026, 14:03 IST
గల్ఫ్ ప్రాంతం నుంచి రెండు భారీ ఎల్పీజీ క్యారియర్‌లు, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్, సుమారు 94 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో భారత తీరం వైపు వస్తున్నాయి. బీడబ్ల్యూ టీవైఆర్ మార్చి 31న ముంబైకి, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ ఏప్రిల్ 1న న్యూమంగళూరుకు చేరుకోనున్నాయి. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నౌకలు, నావికుల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.