
ఐపీఎల్-2026: నేడు LSG vs DC
సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్(LSG) బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో తలపడనుంది. గత రెండు సీజన్లలో పాయింట్స్ టేబుల్లో LSG ఏడో స్థానానికి పరిమితమైంది. ఈసారైనా సమష్టి ప్రదర్శనతో రాణించాలని LSG ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ సారథ్యంలోని DC మీదా అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు.




