చిల్లర నాణేలతో నామినేషన్.. సూర్యాపేటలో విచిత్రం

3చూసినవారు
చిల్లర నాణేలతో నామినేషన్.. సూర్యాపేటలో విచిత్రం
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో సూర్యాపేటలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 14వ వార్డు నుంచి ప్రజా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ లెక్చరర్ లింగిడి వెంకటేశ్వర్లు, నామినేషన్ దాఖలుకు అవసరమైన రూ.1250 డిపాజిట్‌ను గోనెసంచి నిండా చిల్లర నాణేలతో తీసుకువచ్చారు. అధికారులు ఆశ్చర్యపోయినా, నాణేలను లెక్కించి ఆయన నామినేషన్‌ను స్వీకరించారు. రిటైర్డ్ ఉద్యోగిగా వేరే ఆదాయం లేక, రోజుకో రూపాయి చొప్పున పొదుపు చేసి ఈ డబ్బుతో నామినేషన్ వేశానని వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్