మునగాల మండలం నేలమర్రి గ్రామంలో రామాంజనేయులు అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.