భారతీయ జనతా పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్” ఉద్ఘాటన కార్యక్రమంలో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. కార్యకర్తలు సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు, అంత్యోదయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.