సూర్యాపేట జిల్లాలో రాబోయే ఐదు రోజులు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎన్. నరసింహ ఐపీఎస్ సూచించారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, వర్షాల సమయంలో అనవసర ప్రయాణాలు తగ్గించాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, తక్కువ దృశ్యమానత ఉన్నప్పుడు హెడ్‌లైట్లు వినియోగించాలని సూచించారు. వరద నీరు ప్రవహించే చోట్ల వాహనాలు దాటించవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద వాహనాలు నిలపవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని ఎస్పీ తెలిపారు.