వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ

0చూసినవారు
వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ
సూర్యాపేట జిల్లాలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, కూలీలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. శిథిల ఇళ్లలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్