సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో నెల రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులను అడిగితే ఓట్లు ఫ్రీగా వేశారా, రూ.2000 తీసుకోలేదా అని అంటున్నారని, అధికారులకు, కౌన్సిలర్లకు ఫోన్లు చేసినా స్పందించడం లేదని వాపోయారు. కాలువ శుభ్రం చేయడానికి రూ.50, చెత్త తరలించడానికి రూ.100 అడుగుతున్నారని, ఇవ్వకపోతే పనులు చేయడం లేదని పారిశుధ్య కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాగునీరు అందించాలని దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.