వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

1చూసినవారు
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
చింతలపాలెం గ్రామానికి చెందిన మేడతి ఆంజనేయులు అదృశ్యమైనట్లు చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబరు 30న కోదాడకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. బంధువులను విచారించినా అతని ఆచూకీ తెలియలేదు. ఆంజనేయులు భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్