సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ మందుల నాగయ్య, తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పిల్లలు చుక్కలు వేయించుకున్న 30 నిమిషాలలోపు వాంతులు చేసుకుంటే మరో డోసు వేయించుకోవాలని, సాధారణ జలుబు, జ్వరం ఉన్నవారు కూడా డ్రాప్స్ తీసుకోవచ్చని తెలిపారు. హైఫీవర్/మెడికేషన్లో ఉన్నవారు పీడియాట్రిషన్ను సంప్రదించాలని, ఈరోజు డోస్ మిస్ అయినవారు ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వేసుకోవాలని సూచించారు.