సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పర్యటన నేపథ్యంలో, సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.