
అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: వర్మ
AP : పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా తనను తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ స్పందించారు. రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయని, అంతిమంగా పార్టీ బాగుండాలనేదే చూడాలని ఆయన అన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వర్మ తెలిపారు. ఈ మార్పులపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.




