రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రమై ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం మాడుగులపల్లి 44.1, కట్టంగూర్ 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.