ఎండిపోయే దశలో వరి పంటకు వర్షం.. రైతుల్లో ఆనందం

966చూసినవారు
ఎండిపోయే దశలో వరి పంటకు వర్షం.. రైతుల్లో ఆనందం
సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు ఎండిపోయే దశలో ఉన్న వరి పొలాలకు ఊరటనిచ్చాయని, ఇది రైతులకు తోడుగా నిలిచిందని కొందరు రైతన్నలు, గ్రామీణ పేదల సంఘం జిల్లా కన్వీనర్ కొనకంచి వీరభద్ర అన్నారు. గత మూడు నెలలుగా వర్షపాతం లేకపోవడం బాధాకరమని, ఈ వర్షం రైతులకు ఎంతో మేలు చేసిందని, దీనిని 'రూపాయల వర్షం'గా అభివర్ణించారు. ముఖ్యంగా 'ఏ లి నోవా' ప్రభావంతో సూర్యాపేట జిల్లా వర్షాలు లేక నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అకాల వర్షం రైతులకు కనుల పండగగా మారింది.

సంబంధిత పోస్ట్