జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

0చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డితో కలిసి శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. బాధితులకు భరోసా, భద్రత కల్పించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, డోర్‌స్టెప్ ఎఫ్‌ఐఆర్‌ను సమర్థంగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నివారణ, సీసీ కెమెరాల విస్తరణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్