రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం: వేడి బూడిదలో పడి ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు

5చూసినవారు
రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం: వేడి బూడిదలో పడి ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో రైస్ మిల్లర్ల అమానుష నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన కుమ్మరించిన వేడి బూడిద కుప్పలో ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి పడిపోగా, అతన్ని కాపాడబోయిన మరో ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.