బరాఖత్గూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి దుర్మరణం

4చూసినవారు
బరాఖత్గూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి దుర్మరణం
శనివారం మునగాల మండల పరిధిలోని బరాఖత్గూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, బరాఖత్గూడెం గ్రామానికి చెందిన సిరికొండ కోటేశ్వరరావు (35) 65వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును రోడ్డు దాటుతుండగా అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవ పంచనామా కోసం కోదాడ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్