ఆత్మకూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

4చూసినవారు
ఆత్మకూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ఏపూర్ క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సోలిపురం సమీపానికి చెందిన ఎర్రనాగుల సైదులు (30) అనే వ్యక్తి మృతి చెందాడు. సైదులు తన తండ్రితో కలిసి గొర్రె పిల్లలను కొనుగోలు చేసేందుకు ఆత్మకూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న తర్వాత బోల్తా కొట్టింది. తీవ్రంగా గాయపడిన సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, అతని తండ్రిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్