
చైనా సీసీటీవీలపై భారత్ నిషేధం
భారతదేశం చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం విధించింది. దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం, సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా కొత్త అవసరాల నిబంధనలను పాటించాలి. ఈ నిర్ణయం వల్ల హిక్విజన్, దహువా వంటి చైనా కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అయితే, భారతీయ సీసీటీవీ తయారీదారులకు ఇది భారీ అవకాశాన్ని కల్పిస్తుంది.




