ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.. జిల్లా ఎస్పీ నరసింహ

1చూసినవారు
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.. జిల్లా ఎస్పీ నరసింహ
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనివారికి మొదటిసారి కౌన్సెలింగ్, రెండోసారి చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్