బిఆర్ఎస్ పార్టీ రైతు ఆధ్వర్యంలోగ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

0చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ రైతు ఆధ్వర్యంలోగ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న దశలో గురువారం వచ్చిన వర్షం పంటలకు ప్రాణం పోసిందని ఈ నేపథ్యంలో గ్రామంలో BRS పార్టీ రైతు విభాగం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన కోట మైసమ్మ, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లులు, శ్రీ రేణుక యల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శివాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి, కట్ట మైసమ్మ తల్లి దేవాలయాల్లో పసుపు కుంకుమలతో పూల దండలతో అలంకరించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊర చెరువులో నీరు చేరడంతో పూలు, పసుపు కుంకుమలతో గంగమ్మ తల్లికి అభిషేకం నిర్వహించి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్