సూర్యాపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కక్కిరెని శ్రీనివాస్, చింతమళ్ల రమేష్, అబ్దుల్ రహీం, కొండపల్లి దిలీప్ రెడ్డి, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఆలేటి మాణిక్యం, నరేందర్ నాయుడు, పడిదల రవి తదితరులు పాల్గొన్నారు.