బండ మీది చందుపట్ల గ్రామంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా

2చూసినవారు
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండ మీది చందుపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి శ్రీ శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కనుల పండుగగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం శేఖర్ రెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మర్రు పూర్ణచంద్రరావు, గ్రామ సర్పంచ్ గాయం ఉదయశ్రీ రెడ్డి, దేవాలయ చైర్మన్ గుండప్పునేని రమేష్ రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్