ప్రముఖ "సాక్షి" తెలుగు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా దాడులు చేయడం ఎడిటర్ ఇంట్లో భయభ్రాంతులు కలిగించడం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి శుక్ర వారం ప్రకటన లో తెలిపారు. ఏపీ పోలీసులు జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నట్లుగా ఉన్నదన్నారు.