ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ రోడ్డు ప్రభుత్వ భద్రత మాసోత్సవం గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, జిల్లా రవాణా శాఖ అధికారి జి సురేష్ రెడ్డి, ఎంబీఏ జయప్రకాశ్ రెడ్డి, ఈ ఆదిత్య, డీబీఐ ఆంజనేయులు ఉన్నారు.