సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని పాతర్లపాడు ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద రద్దయిన నామినేషన్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నామినేషన్లలో తప్పులు ఏమిటో చెప్పాలని కోరినా అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే తమ నామినేషన్లను తిరస్కరిస్తున్నారని వారు ప్రశ్నించారు.