శనివారం తుంగతుర్తి కోర్టు ప్రాంగణంలో జరిగిన లోక్‌అదాలత్‌లో గొట్టిపర్తికి చెందిన వీరమల్లు, సరిత దంపతులు తమ మనస్పర్థలను వీడి ఒక్కటయ్యారు. 2012లో వివాహం చేసుకున్న ఈ దంపతులు, క్షణికావేశంతో వేరువేరుగా ఉంటున్నారు. జడ్జి ఎండీ.గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్‌అదాలత్‌లో వారిద్దరూ తిరిగి కలవడంతో అక్కడున్నవారు సంతోషం వ్యక్తం చేశారు.