సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేపల్లెలో ఆంధ్ర, తెలంగాణ మత్స్య కారుల మధ్య వివాదం తలెత్తింది. గత పది రోజులుగా ఈ సమస్య కొనసాగుతోంది. తెలంగాణ మత్స్య కారులు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు రేపల్లె గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఆంధ్ర వర్గం అందుబాటులో లేకపోవడంతో, మంగళవారం మత్స్య కార ఏడీ సమక్షంలో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.