తెలంగాణ గణిత ఫోరం సూర్యాపేట జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం సూర్యాపేట కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కందికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఉన్నత పాఠశాలకు తప్పనిసరిగా రెండు గణిత పోస్టులు, గణిత ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం టిఎంఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికకు రాష్ట్ర పరిశీలకులు కొరివి కృష్ణ, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అడిగే సతీష్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా మండవ ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా జలగం పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శిగా సురేందర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు.