సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్), మోతె మండలాల్లో అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటకడుతూ లక్షలు దండుకుంటున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు. నిందితుల వద్ద నుండి సుమారు రూ. 70 లక్షలు విలువగల 21 క్వింటాల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.