సూర్యాపేట కలెక్టరేట్ లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సీతారామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య తెలంగాణ పోరాటాల్లో లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషిని, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ, ఆయన ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.