సూర్యాపేట: జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

84చూసినవారు
సూర్యాపేట: జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి
పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సూర్యాపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అజయ్ జనసేన అన్నారు. జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే జనసేన ఆవిర్భావ సభ కరపత్రాలను గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్