సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం గోవింద మాల భక్త బృందం ఆధ్వర్యంలో మండల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాల ఆచార్యులు మరియు అర్చక బృందం స్వామివారికి 108 కలశములతో తిరుమంజన స్నపనం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్లరసాలు, శుద్ధోదకం గంధోదకం, పుష్పోదకం, ఫలోదకములతో ధూప దీపాలతో ఘనంగా మండల పూజ నిర్వహించారు.