సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, హుజూర్‌నగర్, కోదాడ డివిజన్ లలో మంత్రి ఉత్తమ్ శుక్రవారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఉదయం ఆయన హైదరాబాదు నుండి బయలుదేరి తిరుమలగిరిలో సీఎం సభకు హాజరవుతారని అక్కడినుండి కోదాడ నియోజకవర్గ మూతి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ లపై సమీక్ష సమావేశం అనంతరం హుజూర్‌నగర్ చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.