సూర్యాపేట: శ్రీ వేంకటేశ్వర స్వామికి లక్షమల్లెలతో అర్చనలు

55చూసినవారు
సూర్యాపేట: శ్రీ వేంకటేశ్వర స్వామికి లక్షమల్లెలతో అర్చనలు
సూర్యాపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి లక్ష మల్లెలతో అర్చనలు నిర్వహించారు. ఆండాళ్ గోష్ఠి మహిళా భక్తుల ఆధ్వర్యంలో అర్చనలు నిర్వహించారు. యజ్ఞాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల హరిచరణ్ ఆచార్యులు సంకల్పం చెప్పి మల్లె పుష్పార్చన విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీహరి ఆచార్యులు, సంకర్షణాచార్యులు ఫణికుమార్ ఆచార్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్