విద్యార్థులకు స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవంను నిర్వహించినట్లు క్రిసెంట్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రామసాని రాజు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తులసమ్మ హోటల్ సమీపంలోని క్రిసెంట్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామసాని, ఉపాధ్యాయులు రాజు, శిరీష, నాగమణి, వెంకన్న, కళ్యాణి, ఉమ, జరీనా, కరుణ పాల్గొన్నారు.