సూర్యాపేట: వ్యక్తి అనుమానాస్పద మృతి

5చూసినవారు
సూర్యాపేట: వ్యక్తి అనుమానాస్పద మృతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అప్పుల బాధతో బండారు బాలకృష్ణ (42) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మున్సిపాలిటీ కార్యాలయం వెనుక అపార్ట్మెంట్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో బాలకృష్ణ తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత వెల్లడవుతాయని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. బాలకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్