ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు సవరణ ఉత్తర్వులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సోమవారం జారీ చేసింది. జులై 15 తరువాతే మిగులు ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతం లో జూన్13 నాటికే మిగులు ఉపాధ్యాయులు అవసరం ఉన్న చోటికి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈచర్యలు తీసుకుంది.