సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఓ) అశోక్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడపత్రికలను ఆవిష్కరించారు. విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొని తమ ప్రతిభను వ్యక్తపరచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు కూడా పాల్గొన్నారు.