సూర్యాపేట కలెక్టరేట్‌లో స్టేజ్–2 ఎన్నికల అధికారుల శిక్షణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ మాట్లాడుతూ, ఎన్నికల విధులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులను సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ప్రతి చర్య చేపట్టాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, సీఈఓ అప్పారావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.